
గ్లామరస్ హీరోయిన్‌గా ఇప్పటి వరకు వెండితెరపై వినోదాన్ని పంచింది నిధి అగర్వాల్. ఇకపై అందరికీ ప్రేమను కూడా పంచుతానంటోంది. ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఓ సంస్థను మొదలుపెట్టింది. కరోనా సెకెండ్ వేవ్‌తో ప్రజలు పడుతున్న బాధలు చూసి చాలామంది సెలెబ్రిటీలు అవసరంలో ఉన్నవారికి తమ వంతుగా సేవ చేస్తున్నారు. నిధి అగర్వాల్ కూడా చేతనైన విధంగా హెల్ప్ చేసింది. అయితే తన సేవను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో చారిటబుల్ ఆర్గనైజేషన్‌ని స్టార్ట్ చేసింది. దీని గురించి మాట్లాడుతూ ‘డిస్ట్రిబ్యూట్ లవ్ అనేది ఓ వెబ్‌సైట్. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఇందులో చెప్పొచ్చు. వారికి కావలసిన వాటిని నా టీమ్ అరేంజ్ చేస్తుంది’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె కెరీర్ మాంచి స్పీడులో ఉంది. యంగ్ హీరోల చిత్రాలతో పాటు పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’లో చేస్తోంది. త్వరలో మహేష్ బాబుతో కూడా నటించనుందనే టాక్ వినిపిస్తోంది. నటిగా ఎదుగుతూనే ఓ వ్యక్తిగా సొసైటీ గురించి ఆలోచిస్తున్న నిధిని అందరూ మెచ్చుకుంటున్నారు.