ఫ్యామిలీస్‌‌ కు నచ్చేలా.. మంజునాథ్ కొత్త సినిమా..

ఫ్యామిలీస్‌‌ కు నచ్చేలా.. మంజునాథ్ కొత్త సినిమా..

‘మా ఊరి ప్రేమకథ’ చిత్రంతో  హీరోగా పరిచయం అయిన మంజునాథ్..  ప్రస్తుతం విక్రమ్, పక్కా ప్రేమికుడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి షూటింగ్ దశలో ఉండగానే తాజాగా మరో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. అభిరామ్ గంటా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని   శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై  వి. లక్ష్మీ దేవి నిర్మిస్తున్నారు. 

ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం నేను  నటిస్తున్న రెండు చిత్రాలు అండర్ ప్రొడక్షన్‌‌లో ఉండగానే మరొక సినిమా చేసే అవకాశం వచ్చింది. అభిరామ్  గంటా చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. 

ఇందులో  నేను ప్యాషన్ డిజైనర్ క్యారెక్టర్‌‌‌‌లో నటిస్తున్నా.  అవుట్ అండ్ అవుట్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఈ చిత్రం రూపొందనుంది’ అని చెప్పాడు.  ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు.