మృత్యుంజయ్ వారం వాయిదా 

మృత్యుంజయ్ వారం వాయిదా 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీవిష్ణు. ముందుగా ఈనెల  28న ‘విష్ణు విన్యాసం’ విడుదలవుతుండగా, మరో వారంలో ‘మృత్యుంజయ్’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. వాస్తవానికి ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్స్‌‌ను   ఒకరోజు గ్యాప్‌‌లో ప్రకటించగా, తాజాగా ‘మృత్యుంజయ్’ ను పోస్ట్ పోన్ చేస్తూ శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. 

మార్చి 6న ఈ సినిమాను  విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  హుస్సేన్ షా కిర‌‌ణ్ దర్శకత్వంలో   సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌‌గా రూపొందిన ఈ మూవీ  సాంగ్స్,  హీరోయిన్,  కామెడీ లేకుండా  ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది.  ఇక  వారం గ్యాప్‌‌లో  రెండు డిఫరెంట్‌‌ జానర్ సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.