
సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలు చూసి దాన్నే అందం అనుకోవద్దని నటి ప్రియ భవానీ శంకర్ తెలిపింది. ‘తెరపై కనిపించే స్టార్లు కూడా ఆ లుక్స్‌ని మెయింటైన్ చేసేందుకు చాలా ఖర్చు చేస్తుంటారు. కానీ ఓ మామూలు కాలేజీ స్టూడెంట్ అవేమీ చేయలేడు. డబ్బులుంటే కాకిని కూడా తెల్లగా మార్చేయొచ్చని అంటారు. ఆ డబ్బును గెలవడానికి కూడా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.
కాబట్టి, శరీర సౌష్ఠవం, రంగు, రూపం వంటి విషయాల్లో మిమ్మల్ని ఎవరైనా నొప్పిస్తే పట్టించుకోవద్దు. దాని గురించి ఆత్మనూన్యత చెందాల్సిన అవసరం లేదు. నన్ను ఇలా చూపించడానికి కూడా పది మంది మేకప్ ఆర్టిస్టుల కష్టం ఉంది.
నిజానికి అసలైన అందం అంటే ఇది కాదు. దానికి సరైన నిర్వచనం ఇంకా కనిపెట్టలేదు’అంటూ ప్రియ తెలిపింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో బీజీగా మారిన ఈ బ్యూటీ.. వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.