పోరాటం చేస్తా.. గెలుస్తా: సమంత

పోరాటం చేస్తా.. గెలుస్తా: సమంత

టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో అనే వ్యాధితో బాధపడుతోంది.. ఇటీవల తన అనారోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ పై ఆమె స్పందిస్తూ..కన్నీరు పెట్టుకుంది. ప్రపంచంలో మయోసైటిస్ వ్యాధిని చాలా మంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపింది. తాను కూడా దీన్ని ఎదుర్కొంటానని.. త్వరలోనే బయటపడతానని చెప్పింది. తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కొందరు వార్తలు రాశారు అది నిజం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తను ఆ పరిస్థితిలో లేనని వెల్లడించింది. ఇప్పుడైతే తను ఇంకా చావలేదని సమంత భావోద్వేగానికి లోనైంది. 

తాజాగా నటించిన 'యశోద' సినిమా ప్రమోషన్ లో భాగంగా సమంత ఈ మేరకు స్పందించింది. తాను ఇప్పుడు కఠిన పరిస్థితిలోనే ఉన్నానని తెలిపింది. అందరి జీవితాల్లో మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయని..ఒక్కొక్క సారి ఒక్క అడుగు కూడా వేయలేనేమో అని అనిపిస్తుందని బాధపడింది. అయితే, తాను పోరాటం చేస్తానని, గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.

ఇక సమంత నటించిన 'యశోద' మూవీ.. ఈ నెల 11న విడుదల కానుంది. హరిశంకర్–హరీశ్ నారాయణ్ నిర్మించిన ఈ సినిమా, సరోగసి నేపథ్యంలో నడుస్తుంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతంతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌ పై సీనియర్‌ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు.