‘మయోసైటిస్‌’ వ్యాధితో బాధపడుతున్న సమంత

‘మయోసైటిస్‌’ వ్యాధితో బాధపడుతున్న సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతోందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై సమంత అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. తాను ‘మయోసైటిస్‌’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ‘యశోద’ సినిమా కోసం డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్‌ చేస్తూ ఓ పోస్ట్‌  పెట్టింది. ఆ ఫొటోలో సమంత చేతికి సెలైన్‌  కనిపిస్తోంది. ఒకవైపు చికిత్స పొందుతూనే మరోవైపు ఆమె సినిమాను పూర్తి చేసేందుకు ఎంతో కష్టపడుతోందని తెలుస్తోంది.  

 "మీ అందరి ప్రేమతో నేను ఈ కష్టాలన్నింటిని ఎదుర్కొంటున్నాను. నా మీద విసిరే రాళ్లను కూడా తట్టుకుంటున్నాను. ‘మయోసైటిస్‌’ అనే వ్యాధితో బాధపడుతున్నా. ఇదంతా మీకు చెప్పాలని అనుకున్నాను" అని  లవ్ ఎమోజీని సింబాలిక్ గా పెట్టి పోస్ట్ చేసింది. సమంత వ్యాధి గురించి  తెలియడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ గురైయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తన లేటెస్ట్ సినిమా యశోద ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. అందుకు చాలా సంతోషంగా ఉందని సమంత పోస్ట్ చేసింది.