అలా పిలవడం సరికాదు

అలా పిలవడం సరికాదు

ఓ వైపు సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సాఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శాసిస్తున్నాయి. ఇక్కడి డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ స్టార్స్, మన స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి అక్కడి ప్రొడ్యూసర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసక్తి చూపిస్తున్నారు. అయినప్పటికీ దక్షిణాది భాషలు,  ఇక్కడి సంస్కృతి,  ఆహారపు అలవాట్లపై కొంత చిన్నచూపు కనిపిస్తుంటుంది. సోషల్ మీడియాలోనూ ఈ ట్రెండ్స్ కనిపిస్తాయి. తాజాగా ఇలాంటి అనుభవమే హీరోయిన్ శ్రుతిహాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎదురైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండే శ్రుతిహాసన్..  తాజాగా ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరదా చిట్ చాట్ నిర్వహించింది.  అందులో ఓ నెటిజన్.. ‘సౌత్ ఇండియన్ యాసలో ఏమైనా చెప్పండి’ అని వ్యంగ్యంగా అడిగాడు. 

దీనిపై అసహనం వ్యక్తం చేసిన శ్రుతి,  ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైర్ అయింది.  ‘ఈ రకమైన  జాతి వివక్ష సరికాదు.. అలాగే మీరు మమ్మల్ని చూసి ఇడ్లీ, దోస,  సాంబార్  అనడం కూడా సరైంది కాదు.  మమ్మల్ని మీరు అనుకరించలేరు, మాలాగా ఉండేందుకు ట్రై చేయకండి.  ఎలా  పడితే అలా పిలిచేస్తే దాన్ని కామెడీగా తీసుకోవడం మా వల్ల కాదు.  సౌత్ యాసలో ఏమైనా చెప్పమన్నావ్ కదా.. ‘నోరు మూసుకుని వెళ్లు..’ అని కౌంటర్ ఇచ్చింది శ్రుతిహాసన్.  అయితే  శ్రుతి ఇంత వైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రియాక్ట్ అవడం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు నెటిజన్స్. సౌత్ స్టార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్స్ చులకనగా చూస్తారని, ఇటీవల జరిగిన ఓ సెలెబ్రిటీ వెడ్డింగ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ బాలీవుడ్ హీరో.. సౌత్ హీరోను ఉద్దేశించి చులకనగా మాట్లాడటమే శ్రుతి ఇంతలా ఫైర్ అవడానికి కారణం అనే టాక్ వినిపిస్తోంది.