సన్నీలియోన్ కు CID నోటీసులు : రూ.2 వేల 400 కోట్ల ఇన్వెస్టమెంట్ ఫ్రాడ్ కేసులో..

సన్నీలియోన్ కు CID నోటీసులు : రూ.2 వేల 400 కోట్ల ఇన్వెస్టమెంట్ ఫ్రాడ్ కేసులో..

కర్ణాటకలో సంచలనం సృష్టించిన రూ. 2 వేల 400 కోట్ల పెట్టుబడి మోసం కేసులో తాజాగా నటి సన్నీ లియోన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు. 

 'ఛాంపియన్' అనే కన్నడ చిత్రంలో సన్నీ లియోన్ ఒక ప్రత్యేక పాటలో నటించారు. ఈ పాట కోసం ఆమెకు దాదాపు రూ. కోటి పారితోషికం అందినట్లు సమాచారం. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ సినిమా ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయనేది తెలుసుకోవడానికి అధికారులు ఆమెను విచారించాలనుకుంటున్నారు.

అయితే ఈ కేసులో సన్నీ లియోన్ నిందితురాలు కాదని స్పష్టం చేస్తూనే...  కేవలం సినిమాకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత కోసం, సాక్షిగా ఆమె వాంగ్మూలం తీసుకోవాలని సీఐడీ భావిస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన భారీ పెట్టుబడి మోసం (రూ. 2,400 కోట్లు) కేసులో నిందితులు డబ్బును  పలు సినిమా ప్రాజెక్టులకు మళ్లించారని దర్యాప్తులో తేలింది. ఈ డబ్బు ప్రవాహాన్ని పట్టుకునే క్రమంలోనే అధికారులు ఇప్పుడు సినిమా రంగంలోని లావాదేవీలపై దృష్టి పెట్టారు.