ఏ ప్రభుత్వమైనా అడక్కుండా చేయాల్సిన పనులు ఇవి.. శేఖర్ కమ్ముల పోస్ట్ వైరల్ !

ఏ ప్రభుత్వమైనా అడక్కుండా చేయాల్సిన పనులు ఇవి.. శేఖర్ కమ్ముల పోస్ట్ వైరల్ !

CJP నిరసనలపై ‘లీడర్’ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించాడు. అదేంటి ‘లీడర్’ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తీసిన సినిమాలు ఉన్నాయిగా అనుకోకండి.. ఈ సినిమా చూస్తే శేఖర్ కమ్ములకు ఉన్న రాజకీయ చైతన్యం, సామాజిక స్పృహ ఏంటో తెలిసిపోతుంది.

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అనధికార Gen-Z ఉద్యమం.. ఢిల్లీలో జరుగుతున్న CJP నిరసనలపై ఆయన స్పందించిన తీరుపై హర్షం వ్యకమైంది. శేఖర్ కమ్ములకు ఉన్న ధైర్యం టాలీవుడ్లో ప్రముఖ సెలబ్రెటీలకు లేకపోవడం శోచనీయం అని Gen-Z నిరసనకారులు మండిపడుతున్నారు.

ఇంతకీ.. శేఖర్ కమ్ముల తన ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ఏంటంటే.. NEET paper leakకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా, NEET paper leak వలన ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకి compensation, మళ్లీ ఇలాంటివి జరగకుండా ఒక గట్టి భరోసా -ఏ ప్రభుత్వమైనా అడక్కుండా చేయాల్సిన పనులు ఇవి.

 

* ఈ చిన్న డిమాండ్లు సాధించుకోడానికా లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుస్తున్నారు! తిండీతిప్పలు మాని దెబ్బలకి ఓర్చుకుని, రాత్రనకా పగలనకా ఉద్యమిస్తున్నారు! 
* పిల్లలు accountability అడుగుతున్నారు. ఇందులో న్యాయం ఉంది. ప్రభుత్వం వాళ్ల మాట వినాలి. వాళ్లకి భరోసా ఇవ్వాలి.  వాళ్ల స్ఫూర్తిని గెలిపించాలి.

* మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు. 
* మన పిల్లలు గెలిస్తే మనం బ్రతికినట్టు. 
* Actually ప్రజలు గెలిస్తే ప్రభుత్వాలు గెలిచినట్టు. 
* Dear Gen z, మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను.  I salute you.