ఓ జంట మోసంతో టీఎస్ ఆర్టీసీకి రూ.21కోట్లు నష్టం

ఓ జంట మోసంతో టీఎస్ ఆర్టీసీకి రూ.21కోట్లు  నష్టం

నష్టాల్లో కూరుకున్న టీఎస్ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఈ క్రమంలోనే అక్కడక్కడా జరిగే మోసాలతో మల్లీ నష్టాలు వెలుగు చూస్తోంది. ఓ సంస్థ యాడ్స్ మేనేజర్, అతని భార్య ఆర్టీసీకి చెల్లించాల్సిన సొమ్ము కాజేశారు. ఈ ఘటనపై వడ్డపు సునీల్, అతని భార్య మృదులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఐపీసీ  406, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది.  గో రూరల్ ఇండియా అనే ఓ సంస్థ హైదరాబాద్ పరిధిలో  5 సంవత్సరాలపాటు ఆ సంస్థ యాడ్స్ వేయించింది.  దీనికిగాను ఆర్టీసీకి దాదాపు రూ.21కోట్లు చెల్లించేందుకు ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది.
సెప్టెంబర్ 12, 2015 నుండి సెప్టెంబర్ 11, 2020 వరకు హైదరాబాద్ పరిధిలోని ఎక్స్ ప్రెస్,  మెట్రో డీలక్స్ బస్సుల్లో ఈ సంస్థ ప్రకటనలు వేయించింది. ఒక సెక్యూరీటి డిపాజిట్ చేసి  కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. తర్వాత బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపింది. వడ్డెపు సునీల్  రూ.10 లక్షల చొప్పున ఐదు చెక్కులను ఇచ్చాడు. కానీ వాటిపై వేరువేరు సంతకాల ఉండటంతో చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో  హైదరాబాద్‌ రీజియన్‌లో రూ.10.7 కోట్లు, సికింద్రాబాద్‌ రీజియన్‌లో రూ.10.9 కోట్లు టీఎస్ ఆర్టీసీకి నష్టం వాటిల్లింది.