ఫస్ట్ టైం.. అదాని పవర్ ప్రాజెక్టుల్లో రిలయన్స్ 26 శాతం వాటా

ఫస్ట్ టైం.. అదాని పవర్ ప్రాజెక్టుల్లో రిలయన్స్ 26 శాతం వాటా

ఇద్దరు బిలియనీరు తొలిసారి చేతులు కలిపారు. బిలియనీర్లు అదానీ, అంబానీలు కలిసి బిజినెస్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని గౌతమ్ అదానీ పవర్ ప్రాజెక్టు్ల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26 శాతం వాటాను కొనుగోలు చేసింది.500 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. 

అదానీ పవర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో క్యాప్టివ్ యూజర్ కింద 500 మెగావాట్ల కోసం 20 సంవత్సరాలు విద్యుత్ కొనుగోలు ఒప్పంద కుదుర్చుకుంది. 

అదానీ పవర్ గ్రూప్స్ లోని మహన్ ఎనర్జన్ లిమిటెడ్ లో 5కోట్ల ఈక్వీటీ షేర్లను కొనుగోలు చేయనుంది. దీని విలువ రూ. 10కు సమానంగా (50 కోట్లు). క్యాప్టివ్ వినియోగం కోసం 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తుందని రెండు సంస్థలు ప్రత్యేక స్టాక్ ఎక్ఛేంజ్ లో వెల్లడించాయి.

గుజరాత్ కు చెందిన ఇద్దరు వ్యాపార వేత్తలు.. ఆసియాలో మొదటి రెండు సంపన్నుల స్థానాలను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.  చమురు, గ్యాస్ నుంచి రిటైల్, టెలికం వరకు తన వ్యాపారాలను విస్తరించారు అంబానీ. సముద్ర పోర్టుల నుంచి బొగ్గు, మైనింగ్ , విమానాశ్రయాల వరకు  అదాని దృష్టి పెట్టారు. 2023 నాటికి అదానీ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి దారుగా ఎదగాలని కోరుకుంటుండగా.. ముఖేష్ అంబానీ గుజరాత్ లోని జామ్ నగర్ లో సోలార్ ప్యానెల్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రజన్, ఇంధన ప్లాంట్ల కోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నారు.