అదానీ కనెక్స్ చేతికి ట్రేడ్ క్యాజిల్‌‌‌‌ టెక్ పార్క్‌‌‌‌

అదానీ కనెక్స్ చేతికి ట్రేడ్ క్యాజిల్‌‌‌‌ టెక్ పార్క్‌‌‌‌

న్యూఢిల్లీ: అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ జాయింట్ వెంచర్ కంపెనీ  అదానీకనెక్స్‌‌‌‌ తాజాగా ట్రేడ్ క్యాజిల్‌‌‌‌ టెక్ పార్క్ లిమిటెడ్‌‌‌‌లో 100 శాతం వాటాను రూ.234.31 కోట్లకు కొనుగోలు  చేసింది. ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలను డెవలప్ చేయడం కోసమే ఈ కొనుగోలు జరిపామని అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌‌‌‌లో  పేర్కొంది. 2023లో ఏర్పాటైన  ట్రేడ్ క్యాజిల్ టెక్ పార్క్, ఇంకా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించలేదు. కానీ భారీగా ల్యాండ్‌‌‌‌ను సేకరించింది. అవసరమైన లైసెన్సులు కూడా పొందింది. 

అదానీ కనెక్స్‌‌‌‌ అనేది అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్,  గ్లోబల్ డేటా సెంటర్ ఆపరేటర్ ఎడ్జ్‌‌‌‌కనెక్స్‌‌‌‌ మధ్య జాయింట్ వెంచర్. ఈ సంస్థ చెన్నై, హైదరాబాద్, నోయిడా, నవీ ముంబై, పుణెలలో డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. ఇటీవల అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో వచ్చే దశాబ్దంలో రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి డేటా సెంటర్లు, ఎనర్జీ, పోర్టులు, సిమెంట్, తయారీ రంగాలను కవర్ చేస్తుంది.