అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌కు రూ.11 వందల 60 కోట్ల నష్టం

అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌కు రూ.11 వందల 60 కోట్ల నష్టం
  • అమెరికా ప్రభుత్వానికి సెటిల్‌‌‌‌మెంట్ కింద రూ.2,644 కోట్లు చెల్లించడంతోనే..

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్లాగ్‌‌‌‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్‌‌‌‌) ఈ ఏడాది జూన్‌‌‌‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1) లో  రూ.1,160 కోట్ల  నికర నష్టాన్ని (కన్సాలిడేటెడ్‌‌‌‌) నమోదు చేసింది. యూఎస్ ప్రభుత్వంతో  కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రూ.2,644 కోట్ల వన్‌‌‌‌టైమ్‌‌‌‌ చార్జీలను చెల్లించాల్సి రావడం ఈ నష్టానికి ప్రధాన కారణం. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ రూ.885 కోట్ల లాభాన్ని పొందింది.

ఈ వన్‌‌‌‌ టైమ్ ఖర్చును పక్కన పెడితే  కంపెనీకి చెందిన విమానాశ్రయం, కాపర్ విభాగాలు పుంజుకోవడంతో ఇబిటా (ట్యాక్స్‌‌‌‌లు, వడ్డీలకు ముందు ప్రాఫిట్‌‌‌‌) ఏకంగా 49శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.5,642 కోట్లకు చేరింది. కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 50శాతం పెరిగి రూ.33,546 కోట్లకు చేరుకుంది. అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌  కాపర్ సేల్స్ 4 రెట్లు పెరగ్గా, విమానాశ్రయాల విభాగం ఆదాయం 35శాతం పెరిగింది.