అదానీ ఎయిర్‌‌పోర్ట్‌  ఇక సెపరేట్ బిజినెస్‌

అదానీ ఎయిర్‌‌పోర్ట్‌  ఇక సెపరేట్ బిజినెస్‌

ముంబై: పబ్లిక్ ఇష్యూ ద్వారా డబ్బులు సేకరించేందుకు ఎయిర్‌‌‌‌పోర్టు బిజినెస్‌‌ను వేరే కంపెనీగా మార్చడానికి హోల్డింగ్ కంపెనీ అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఐపీఓకు ముందే షేర్ల  ప్రైవేట్ ప్లేస్‌‌మెంట్ ద్వారా 500 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.3,556 కోట్లు) సమీకరించాలని కూడా ప్రయత్నిస్తోంది. మనదేశంలోని రెండో అతి పెద్ద విమానాశ్రయం.. ముంబై ఎయిర్‌‌‌‌పోర్టును అదానీ గ్రూపు ఆపరేట్‌‌ చేస్తోంది. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ బిజినెస్ కు రూ. 25,500–-29,200 కోట్ల వాల్యుయేషన్‌‌ను సాధించాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. "అదానీ ఉద్యోగులు, ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ బ్యాంకర్ల మధ్య ఇది వరకే చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు కరోనా వల్ల ప్రయాణాలు తక్కువగా ఉన్నాయి. ఎయిర్‌‌‌‌పోర్టులో ప్యాసింజర్ల సంఖ్య పెరిగే వరకు ఆగాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది చివరిలో పబ్లిక్ ఇష్యూను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి” అని సంబంధిత వర్గాలు తెలిపాయి.  అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ మీడియా వేసిన ప్రశ్నలకు స్పందించలేదు. గౌతమ్ అదానీ నాయకత్వంలోని ఈ వ్యాపార సంస్థ 2019 లో విమానాశ్రయ రంగంలోకి ప్రవేశించింది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు,  జైపూర్, గువాహటి,  తిరువనంతపురం – విమానాశ్రయాల డెవెలప్‌‌మెంట్‌‌, మోడర్నైజ్ కాంట్రాక్టులను దక్కించుకుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్టు లిమిటెడ్ (మియల్)లో గత ఏడాది ఆగస్టులో 74 శాతం వాటాను కొనుగోలు చేసింది. త్వరలో మొదలయ్యే నవీ ముంబై విమానాశ్రయం కూడా అదానీ చేతికి రాబోతోంది.  దీనిలో మియల్‌‌కు 74 శాతం వాటా ఉంది. అదానీ ఎయిర్‌‌‌‌పోర్టులకు రూ. 4,100 కోట్లు అప్పులు ఉన్నాయి.  ఈ ఎయిర్‌‌‌‌పోర్టుల క్యాపెక్స్ కోసం సుమారు రూ.30 వేల కోట్లు కేటాయిస్తామని అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ సీఈఓ రాబీ సింగ్ ఇటీవల చెప్పారు. వీటిలో అప్పు విలువ రూ.21 వేల కోట్లని అన్నారు . మియల్ 2019 ఆర్థిక సంవత్సరంలో రూ .3,847.4 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు  ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.3,545.2 కోట్లుగా నమోదైం