
Samvat 2082: దీపావళి కోసం మోటిలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ 2025లో పెట్టుబడి పెట్టమని 10 ముఖ్యమైన స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. పండుగ రోజున ప్రత్యేకంగా నిర్వహించబడే ముహురత్ ట్రేడింగ్ సెషన్ ఈ ఏడాది అక్టోబర్ 21న మధ్యాహ్నం 1:45 నుండి 2:45 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ సెషన్ హిందూ ఆర్థిక సంవత్సరమైన సమ్వత్ 2082 ప్రారంభాన్ని సూచిస్తుంది. గడచిన 10 ఏళ్లలో కేవలం 2016, 2017లో మినహా ప్రతి ఏటా ముహురత్ ట్రేడింగ్ 2015 నుంచి 2024 వరకు లాభాల్లోన్నే ట్రేడింగ్ ముగించాయి. గతంలో దీనిని సాయంత్రం నిర్వహించేవారు ప్రస్తుతం దీనిని మధ్యాహ్నానికి మార్చారు.
ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ లాభదాయకంగా స్టార్ట్ అవుతుందని మోటిలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ భావిస్తోంది. ఈ క్రమంలో సంస్థ పెట్టుబడిదారులు కొనుగోలు కోసం 10 షేర్లను ఎంపిక చేసి లిస్ట్ విడుదల చేసింది. వీటిలో మహీంద్రా & మహీంద్రా, భారత్ ఎలెక్ట్రానిక్స్, స్విగీ, ఇండియన్ హోటల్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్, రాడికో ఖైతాన్, డెలివరీ, ఎల్‌టీ ఫుడ్స్, విఐపీ ఇండస్ట్రీస్, ఎస్బీఐ ఉన్నాయి. వీటికి గట్టి వృద్ధి అవకాశాలు ఉన్నట్టు బ్రోకరేజ్ అంచనా వేస్తోంది.
ALSO READ : పెద్దలకు మాత్రమే శృంగార కంటెంట్..
షేర్లు టార్గెట్ ధరల వివరాలు..
- State Bank of India: టార్గెట్ ధర- రూ.వెయ్యి
- Mahindra & Mahindra: టార్గెట్ ధర- రూ.4వేల 091
- Bharat Electronics: టార్గెట్ ధర- రూ.490
- Swiggy: టార్గెట్ ధర- రూ.550
- Indian Hotels: టార్గెట్ ధర- రూ.880
- Max Financial: టార్గెట్ ధర- రూ.2వేలు
- Radico Khaitan: టార్గెట్ ధర- రూ.3వేల 387
- Delhivery: టార్గెట్ ధర- రూ. 540
- LT Foods: టార్గెట్ ధర- రూ. 560
- VIP Industries: టార్గెట్ ధర- రూ. 530
మోటిలాల్ ఓస్వాల్ సంవత్ 2082 ప్రారంభం సానుకూలంగా ఉందని అన్నారు. రూ.లక్షల కోట్ల ఆదాయం పన్ను ఆఫర్లు, GST 2.0 మార్పులు, అదులుపులోనే ఉన్న ద్రవ్యోల్బణం, ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదల దేశీయ వృద్ధికి తోడ్పడతాయని బ్రోకరేజ్ వెల్లడించింది. FY26 తరువాత నిఫ్టీ స్టాక్స్ డబుల్ డిజిట్ వృద్ధి సాధిస్తాయని, కాబట్టి చౌక ధరల్లో స్టాక్స్ కొనుగోలుకు ఇది మంచి సమయం అని విశ్లేషించింది. బ్రోకరేజ్ సూచించిన స్టాక్స్ ఇన్వెస్టర్లకు దీర్ఘకాలిక లాభాల అవకాశాలు కల్పిస్తాయని చెప్పొచ్చు.