పెట్రోకెమికల్ రంగంలో అదానీ, అంబానీ మధ్య పోటీ .. 10 లక్షల టన్నుల సామర్ధ్యంతో పీవీసీ ప్లాంట్ పెట్టనున్న అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌

పెట్రోకెమికల్ రంగంలో అదానీ, అంబానీ మధ్య పోటీ .. 10 లక్షల టన్నుల సామర్ధ్యంతో పీవీసీ ప్లాంట్ పెట్టనున్న అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని ముంద్రాలో ఏడాదికి 10 లక్షల టన్నుల సామర్ధ్యం ఉన్న పీవీసీ  ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను  నిర్మించనుంది. దీంతో పెట్రోకెమికల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రిలయన్స్ ఇండస్ట్రీస్ హవా కొనసాగుతోంది. పీవీసీ (పాలివినైల్ క్లోరైడ్‌‌‌‌‌‌‌‌) ని  పైపులు, విండో ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌లు, కేబుల్ ఇన్సులేషన్, ఫ్లోరింగ్, కార్డ్‌‌‌‌‌‌‌‌లు, బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు. 

భారత్‌‌‌‌‌‌‌‌లో 40 లక్షల టన్నుల పీవీసీ డిమాండ్ ఉండగా, ఉత్పత్తి సామర్థ్యం మాత్రం 15.9 లక్షల టన్నులు మాత్రమే ఉంది.  ఇందులో సగం రిలయన్స్‌‌‌‌‌‌‌‌దే. అదానీ గ్రూప్ ప్లాంట్ 2028 నాటికి అందుబాటులోకి వస్తుంది.  అదానీ అసిటిలీన్, కార్బైడ్ ఆధారిత ప్రక్రియని ఉపయోగిస్తుంది. ఇది సప్లై గ్యాప్, దిగుమతులను తగ్గిస్తుందని అంచనా. రిలయన్స్ (7.5 లక్షల టన్నులు)తో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా పోటీ పడనుంది.