- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.4.75 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ షేర్ల భారీ పెరుగుదల, ఐటీ షేర్ల తగ్గుదల వల్ల బుధవారం అదానీ పవర్ మార్కెట్ విలువలో ఇన్ఫోసిస్‌ను అధిగమించింది. మంగళవారం ట్రేడింగ్‌లో అదానీ పవర్ షేరు రూ.252.65 గరిష్ఠ స్థాయిని తాకడంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.4.82 లక్షల కోట్లకు చేరింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.4.75 లక్షల కోట్లుగా ఉంది. అదానీ పవర్ షేర్లు గత ఏడాదిలో దాదాపు 124 శాతం పెరిగాయి. ఈ ఏడాది మార్చిలో రూ.139 వద్ద ఉన్న షేరు ఈనెల 27న రూ.252.65 కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరింది.
మార్కెట్క్యాప్ రూ.4.77 లక్షల కోట్లకు పెరిగింది. ఏఐ వల్ల ఎదురయ్యే సవాళ్లు, సాంప్రదాయ ఐటీ సేవల డిమాండ్ తగ్గడంతో ఇన్ఫోసిస్ షేర్లు ఈ ఏడాది 29 శాతం పడిపోయాయి. 2027 ఆర్థిక సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనాలను 1.5 శాతం నుంచి 3.5 శాతంగా ప్రకటించింది. దీంతో ఈ నెల 14న ఇన్ఫోసిస్ షేరు రూ.1,089 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.
