అదానీ పవర్​ లాభం రూ.5,242.48 కోట్లు

అదానీ పవర్​ లాభం రూ.5,242.48 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​కు చెందిన అదానీ పవర్​ నికర లాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​ లో 12.9 శాతం పెరిగి రూ. 5,242.48 కోట్లకు చేరుకుంది. 2021–-22 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో  రూ. 4,645 కోట్ల లాభం వచ్చింది. ఇదేకాలంలో మొత్తం ఆదాయం రూ.10,795 కోట్ల నుంచి రూ.13,308 కోట్లకు పెరిగింది.   2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 31,686 కోట్లు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది 35.8 శాతం పెరిగి రూ.43,041 కోట్లకు చేరింది.  

టారిఫ్ పెరగడం,  దిగుమతి బొగ్గు ధర ఎక్కువ రావడం, వన్-టైమ్ రాబడి వల్ల  లాభాలు బాగున్నాయి.  2021–-22  ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022–-23 ఆర్థిక సంవత్సరంలో  కన్సాలిడేటెడ్​ ఇబిటా  రూ. 13,789 కోట్ల నుంచి రూ. 14,312 కోట్లకు ఎగిసింది.  2023 ఆర్థిక సంవత్సరం ఆదాయం 35.8శాతం వృద్ధితో రూ. 43,041 కోట్లకు పెరిగింది. ఇబిటా 3.8శాతం వృద్ధితో రూ. 14,312 కోట్లకు పెరిగింది. లాభం సంవత్సరానికి 118.4శాతం పెరిగి రూ. 10,727 కోట్లకు పెరిగింది.