ఎంజీ డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ల దగ్గర ఏటీఈఎల్‌‌‌‌ ఛార్జింగ్ పాయింట్లు

ఎంజీ డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ల దగ్గర ఏటీఈఎల్‌‌‌‌ ఛార్జింగ్ పాయింట్లు

న్యూఢిల్లీ: ఎంజీ డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ల దగ్గర ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తామని అదానీ టోటల్‌‌‌‌ఎనర్జీస్‌‌‌‌ ఈ–మొబిలిటీ  (ఏటీఈఎల్‌‌‌‌) ప్రకటించింది. అదానీ టోటల్‌‌‌‌ గ్యాస్‌‌‌‌కు ఇది  సబ్సిడరీ. సీసీ2 60 కేడబ్ల్యూ డీసీ చార్జింగ్ స్టేషన్లను కొత్త ఎంజీ డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ల దగ్గర  ఏటీఈఎల్‌‌‌‌  ఏర్పాటు చేస్తుంది. ఇందుకు  సంబంధించి  ఎంజీ మోటార్స్‌‌‌‌తో  ఒప్పందం కుదుర్చుకుంది.  అంతేకాకుండా ఒక మొబైల్ యాప్‌‌‌‌ను కూడా తీసుకురానున్నారు. 

సీఎన్‌‌‌‌జీ అమ్మే అదానీ టోటల్‌‌‌‌గ్యాస్‌‌‌‌   ఏటీఈఎల్‌‌‌‌తో  ఈవీ బిజినెస్‌‌‌‌లోకి ఎంటర్ అయ్యింది. తన సీఎన్‌‌‌‌జీ స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతానికి ఏటీఈఎల్‌‌‌‌కు 300 కి పైగా ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ఏసీ, డీసీ ఛార్జింగ్ పాయింట్లను కంపెనీ ఆపరేట్ చేస్తోంది. షాపింగ్ మాల్స్‌‌‌‌, వర్క్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లు వంటి పబ్లిక్ ప్లేస్‌‌‌‌లలో ఈ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది. మరో వైపు 500 ఛార్జింగ్ పాయింట్లు నిర్మాణ దశలో ఉన్నాయి.