మొగుళ్లపల్లి, వెలుగు: వడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ రైతులకు సూచించారు. మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నాణ్యమైన వడ్లనే కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. 17 శాతం తేమ వచ్చిన వెంటనే తూకం వేసి, మిల్లులకు తరలించాలన్నారు. అనంతరం వరికోతలు చేపడుతున్న హార్వెస్టర్ల యజమానులు, డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. సొసైటీ గోదాంలో గన్నీ బ్యాగులను పరిశీలించారు. సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ఆఫీసర్ కిరణ్ కుమార్, డీఎం రాములు, పీఏసీఎస్ చైర్మన్ నర్సింగరావు, తహసీల్దార్ సునీత పాల్గొన్నారు.
