గడ్డపోతారం మున్సిపాలిటీ ఆఫీసును తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

గడ్డపోతారం మున్సిపాలిటీ ఆఫీసును తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

జిన్నారం, వెలుగు:  గడ్డపోతారం మున్సిపాలిటీ ఆఫీసును మంగళవారం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా పరిశీలించారు.  ఆఫీసులోని రికార్డులను తనిఖీ చేశారు. ప్రైమరీ స్కూల్ కు వెళ్లే దారిని చూశారు. ట్యాంకర్ల రవాణా వల్ల రోడ్డు ధ్వంసం కావడంతో ట్యాంకర్ల యజమానుల సహకారంతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కమిషనర్ కు సూచించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.

 మున్సిపల్ లో జరుగుతున్న ఓటర్ల జాబితా మ్యాపింగ్ ను 100శాతం  పూర్తయ్యే విధంగా బీఎల్వోలు పనిచేయాలన్నారు. మున్సిపాలిటీలో  సిటిజన్ సర్వీస్ చాట్ ఏర్పాటు చేయాలని సూచించారు. సర్వీస్ లాగిన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, మున్సిపల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.