ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేయాలి : కలెక్టర్ డాక్టర్ శ్రీజ

ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేయాలి : కలెక్టర్  డాక్టర్ శ్రీజ
  • స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  డాక్టర్ శ్రీజ

ఖమ్మం టౌన్,  వెలుగు: ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్స్, టీచర్లకు ఫేసియల్ రికగ్నైజేషన్  సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎఫ్ఆర్ఎస్ విధానంలో అటెండెన్స్ నమోదుపై విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి. శ్రీజ మాట్లాడుతూ..   పాఠశాలల వారీగా పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలన్నారు.  

యూడీఐఎస్‌ఈ పోర్టల్ లో స్కూల్‌కు సంబంధించి వివరాలను అప్‌డేట్ చేయాలన్నారు.  ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆగస్టు చివరి నాటికి అపార్ నెంబర్ జనరేట్ చేయాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారిణి నాగ పద్మజ, విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ పాల్గొన్నారు. 

నిబంధనలు పాటించాలి 

పాడి పశువుల కొనుగోలులో నిబంధనలు పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. ఇందిరా మహిళా డెయిరీ గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఇందిరా మహిళా డెయిరీ గ్రౌండింగ్‌లో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి  రెండు పాడి పశువుల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.  పాడి పశువుల కొనుగోలు కోసం కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 

కొనుగోలు, రవాణా, బీమా సౌకర్యం తదితర అంశాల్లో పాటించాల్సిన విధానాలపై చర్చించి, పలు సూచనలు చేశారు.  శుక్రవారం నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ప్రతి పాడి పశువుకు జియో ట్యాగ్ వేయాలన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.