అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీజ

అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలి :  అడిషనల్ కలెక్టర్ శ్రీజ
  • విద్యా శాఖ అధికారుల సమీక్షలో ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ శ్రీజ

ఖమ్మం టౌన్, వెలుగు : అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో విద్యా శాఖపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో యూనిఫామ్స్ మొదటి జత రాని కొత్త విద్యార్థుల జాబితా, రెండవ జత రాని స్టూడెంట్స్​ వివరాలు అందించాలన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్స్​ రెండు జతలు పంపిణీ చేసినప్పటికీ ఆన్ లైన్ నమోదులో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, వీటిని గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. టీచర్లు, స్టూడెంట్స్​ పెండింగ్ ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.  అవసరానికి మించి టీచర్లు ఉన్న పాఠశాల జాబితా, టీచర్ల జాబితా తయారు చేయాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య,  విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, మండల విద్యాధికారులు ఉన్నారు.