ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పరిశీలన : అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పరిశీలన : అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి

మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో గురువారం అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి పర్యటించారు. మండల కేంద్రానికి చెందిన పిల్లి స్రవంతికి ఇందిరమ్మ ఇల్లు మంజూరవగా, బేస్మెంట్ లెవెల్ వరకు ఇంటి పనులు చేస్తుంది. చేసిన పనులకు బిల్లు రాకపోవడంతో పాటు ఆన్​లైన్​లో పేరు కనిపించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి గురువారం ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి, పరిస్థితిపై ఆరా తీశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బిల్లు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు మండలంలోని పర్లపల్లిలో సైడ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఆమెవెంట ఎంపీడీవో సురేందర్ గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వాతి తదితరులున్నారు.