24 గంటల్లోగా వడ్లను దింపుకోవాలి..అడిషనల్ కలెక్టర్ రమేశ్

24 గంటల్లోగా వడ్లను దింపుకోవాలి..అడిషనల్ కలెక్టర్ రమేశ్

మెదక్​ టౌన్​,  తూప్రాన్‌‌‌‌ , వెలుగు : రైతులు మిల్లులకు తీసుకువచ్చిన ధాన్యాన్ని 24 గంటల్లోగా అన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయాలని అడిషనల్ కలెక్టర్  రమేశ్‌‌‌‌ ఆదేశించారు. గురువారం మెదక్ పట్టణంలోని మంజీరా , ఛాముండేశ్వరి, తూప్రాన్ పట్టణంలోని నవదుర్గ, సాయినాథ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీల సంఖ్యను పెంచుకొని లారీలు వచ్చిన 24 గంటల్లోగా ధాన్యం అన్ లోడ్ చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు.  

ధాన్యంలో కోత పెట్టపెద్దవని, ధాన్యం దింపుకున్న వెంటనే ట్రక్ షీట్ జారీచేయాలన్నారు. 15 రోజులు అప్రమత్తంగా ఉండి లారీల సమస్య తలెత్తకుండా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.  కొనుగోళ్లలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్‌‌‌‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్, తహసీల్దార్ జ్ఞాన జ్యోతి తదితరులు పాల్గొన్నారు.