డీఈఈటీ ద్వారా ఉగ్యోగ అవకాశాలు

డీఈఈటీ ద్వారా ఉగ్యోగ అవకాశాలు

ఖమ్మం టౌన్, వెలుగు : కంపెనీలకు, నిరుద్యోగులకు మధ్య వారధిగా డీఈఈటీ పని చేస్తుందని అడిషనల్​ కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో సోమవారం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ  గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని  అధికారులకు  సూచించారు. డీఈఈటీ ప్లాట్ ఫార్మ్ , యాప్ పని తీరు పై సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

 ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్ ను నిరుద్యోగులు డౌన్ లోడ్ చేసుకుని తమ రెజ్యూమ్ అప్ లోడ్ చేస్తే, మార్కెట్ లో వారి నైపుణ్యాలకు అనుగుణంగా  ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. డీఈఈటీ యాప్ ద్వారా ఇంటర్న్ షిప్, అప్రెంటిస్ షిప్ వివరాలు, నైపుణ్య శిక్షణ సంస్థ వివరాలను, జాబ్ మేళా వివరాలు సమాచారం రెగ్యులర్ గా అందుతుందని చెప్పారు. అనంతరం డీఈఈటీ వాల్​ పోస్టర్​ను ఆవిష్కరించారు.

జాయింట్ సర్వే చేయాలి

ఆర్ అండ్ బీ, ఎన్ హెచ్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు జిల్లాలో చేపట్టే రోడ్డు నిర్మాణ పనుల వల్ల మిషన్ భగీరథ పైప్ లైన్ లు దెబ్బ తినకుండా చూడాలన్నారు. కొత్త రోడ్ల మంజూరు సమయంలో తాగునీటి పైప్ లైన్ తరలింపు పనులకు అంచనాలు రోడ్డు నిర్మాణ వ్యయంలో పెట్టాలని, దీనికి సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు జాయింట్ గా తనిఖీ నిర్వహించాలని సూచించారు.