
కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా అధీర్ రంజన్ చౌధరీ వ్వవహరించనున్నారు. ఇందుకు గాను కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. లోక్ సభలో పార్టీకి నాయకత్వం వహించడానికి రాహుల్ ఇష్టపడక పోవడంతో… సోనియా గాంధీ పలువురు పేర్లను పరిశీలించారు. ఈ క్రమంలో శశిథరూర్, మనీశ్ తివారీ, అధీర్ రంజన్ చౌదరితో పాటు.. కేరళకు చెందిన కే.సురేశ్ పేర్లు వినిపించాయి. అయితే సోనియా గాంధీ చివరికి రంజన్ చౌధరీనే ఫైనల్ చేశారు. దీంతో పాటే సోనియా గాంధీ కుటుంబానికి రంజన్ విధేయులుగా ఉన్నారు. యూపీఏ-2లో కేంద్ర మంత్రిగా పని చేశారు. గతంలో బెంగాల్ పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా ఆయనకు పనిచేసిన అనుభవం ఉంది.
బెహరం పూర్ రాబిన్ హుడ్
రంజన్ వెస్ట్ బెంగాల్ లోని బెరహంపొరె నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు వరుసగా ఐదు సార్లు ఎంపీ గా గెలిచారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను తీర్చడంలో రంజన్ ముందుంటారని స్థానికులు తెలిపారు. ఇందుకే రంజన్ ను తాము ‘బెహరం పూర్ రాబిన్ హుడ్’ గా పిలుచుకుంటామని చెప్పారు.