పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నరు

పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నరు

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నపై ఫైర్ అయ్యారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్. తాను పార్టీ మారుతున్నట్టు ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీస్ స్థలం పైనా అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో జరిగే అవినీతి అక్రమాలపై ఆధారాలిస్తానని, విచారణ జరిపించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఆస్తులతో పాటు అన్ని విషయాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు పాయల శంకర్.