ఆదిలాబాద్, వెలుగు: ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మెషీన్ ప్రాజెక్టును ప్రదర్శించిన మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయం విద్యార్థులు వైష్ణవి, రానుషను కలెక్టర్ రాజర్షి షా, ట్రైనీ కలెక్టర్ సలోని ఛాబ్రా ఆదివారం సన్మానించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని వారికి సూచించారు.
అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొనడం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగకరమని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒకే యంత్రంతో పలు వ్యవసాయ పనులు చేయగలిగేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయడం ప్రశంసనీయమని, రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
