
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష, రూ. 4 వేల చొప్పున జరిమానా విధిస్తూ..ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బుధవారం తీర్పు ఇచ్చారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్మహాజన్తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని జైనథ్ పోలీస్ స్టేషన్‌పరిధిలో 2022, జనవరిలో ఆదిలాబాద్‌టౌన్ కు చెందిన ఇందూర్ గజానంద్అనే వ్యక్తిని బంగారిగూడకు చెందిన షేక్‌అస్లాం, కోకాటి విజయ్హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి చార్జ్ షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం నిందితులకు జైలుశిక్ష, జరిమానా ఖరారు చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు డ్యూటీ అధికారి జమీర్ 25 మంది సాక్షులను కోర్టులో హాజరుపరచగా పీపీ మేకల మధుకర్, రహీం సాక్షులను విచారించి నిందితులకు శిక్షపడేలా వాదనలు వినిపించారు.
ఖమ్మం జిల్లాలో మరో హత్య కేసులో కూడాముగ్గురికి జీవిత ఖైదు
కూసుమంచి : హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు, రూ. 5 వేలు, మరో ఏడుగురికి రూ. 10వేల జరిమానా విధిస్తూ ఖమ్మం జిల్లా కోర్టు జడ్జి బి. రాజగోపాల్ బుధవారం తీర్పు చెప్పారు. ఎస్ఐ జగదీశ్తెలిపిన ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం మేకలతండా పంచాయతీ శివారు కుక్కలతండాలో 2023 జులై లో భూ వివాదంలో ఇస్లావత్ భద్రుపై బోడ రవి, ఇస్లావత్ కిషన్, ఇస్లావత్సేవ ముగ్గురూ కలిసి దాడి చేశారు. దీంతో భద్రు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేశారు. 10 మంది నిందితులను రిమాండ్ కు పంపారు. వాదోపవాదాల అనంతరం ముగ్గురికి జైలు శిక్షతో పాటు మరో ఏడుగురికి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.