సమస్య ఏదైనా ఫిర్యాదు వాట్సప్లోనే ..మంత్రి జూప‌‌‌‌ల్లి ఆదేశాల‌‌‌‌తో ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  కలెక్టరేట్లలో ప్రత్యేక గ్రీవెన్స్ 

సమస్య ఏదైనా ఫిర్యాదు వాట్సప్లోనే ..మంత్రి జూప‌‌‌‌ల్లి ఆదేశాల‌‌‌‌తో ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  కలెక్టరేట్లలో ప్రత్యేక గ్రీవెన్స్ 
  • మినిస్టర్​ పేషీ, కలెక్టర్​ ఆఫీసుల్లో వాట్సప్ నంబ‌‌‌‌ర్లు 
  • ప్రజలు స‌‌‌‌ద్వినియోగం చేసుకోవాల‌‌‌‌న్న మంత్రి 

మంచిర్యాల, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్​చార్జి మినిస్టర్​ జూప‌‌‌‌ల్లి కృష్ణారావు ఆదేశాల‌‌‌‌తో ప్రభుత్వ సేవలపై ఫిర్యాదులకు ఇకపై ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేకుండా సరికొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. వాట్సప్‌‌‌‌లో ప్రభుత్వ సేవలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించాలని మంత్రి ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు చేశారు. ఈ నేప‌‌‌‌థ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు కలెక్టరేట్లలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు.

ప్రజలు తమ ఫిర్యాదులు, వినతుల కోసం కలెక్టరేట్‌‌‌‌కు రాకుండా ఇంటి వద్ద నుంచే అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా వాట్సప్  సేవ‌‌‌‌ల‌‌‌‌ను కలెక్టర్లు అందుబాటులోకి తెచ్చారు. హైద‌‌‌‌రాబాద్​లోని మంత్రి జూప‌‌‌‌ల్లి పేషీలోనూ ఈ సేవ‌‌‌‌ల‌‌‌‌ను వినియోగించుకోవ‌‌‌‌చ్చు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించడంతో పాటు వాటి పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని మంత్రి సూచించారు. ప్రజలు ఫిర్యాదుతో పాటు సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్య ఉన్న ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, ఫొటోలు పంపించి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

వాట్సప్‌‌‌‌ నంబర్లు

మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీ: 8500689596
ఆదిలాబాద్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌: 9492341947
నిర్మల్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌: 8317557897
కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌: 7569986036
మంచిర్యాల కలెక్టరేట్‌‌‌‌: 9492123642