
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్ర ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ప్యాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ పై విమర్శలు చెలరేగినా..ట్రైలర్ మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. భారత్ తో పాటు..యూఎస్ఏ, యూకే, కెనడా సహా అనేక దేశాల్లో మే9వ తేదీన ఆదిపురుష్ ట్రైలర్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ ను ఆకాశానికెత్తేసింది.
మంచి బాలుడు..
రాముడిలాగే ప్రభాస్ మంచివాడని హీరోయిన్ కృతి సనన్ పొగడ్తల్లో ముంచెత్తింది. అతని సింప్లిసిటీ అంటే తనకెంతో ఇష్టమని కృతి సనన్ చెప్పింది.
నెట్టింట వైరల్..
ఆదిపురుష్ సినిమాలో రఘునందనుడిగా ప్రభాస్, జానకిగా కృతి లుక్ ఆకట్టుకుంటోంది. వీరిద్దరి జోడీ చూడచక్కగా ఉందంటూ ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు. ప్రభాస్‌తో కృతి సనన్ రిలేషన్‌పై ఎంతో కాలంగా రూమర్స్ఉన్నాయి. ఆదిపురుష్ సెట్స్‌లో వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో కృతి కాంప్లిమెంట్స్.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
విమర్శలకు చెక్
ఆదిపురుష్ ట్రైలర్ తో ఎంతో కాలంగా వస్తున్న విమర్శలకు మూవీ టీం చెక్ పెట్టింది. ప్రభాస్ రాముని పాత్రలో కృతిసనన్ సీత పాత్రలో నటించిన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 5 వారాల సమయం మాత్రమే ఉంది. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచిన ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాతో హిట్ కొడతాడని మేకర్స్ చెబుతున్నారు.