రెండు రోజుల్లో రూ.200 కోట్లు .. ఆదిపురుష్ రికార్డుల మోత!

రెండు రోజుల్లో రూ.200 కోట్లు .. ఆదిపురుష్ రికార్డుల మోత!

ఆదిపురుష్(Adipurush) మూవీ రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గరా భారీ వసూళ్ళను రాబట్టింది. మొదటి షో నుండి ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయినా కూడా మొదటి రోజు రికార్డ్స్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫస్ట్ డే  రూ. 140 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఒక్క తెలుగులోనే 50 కోట్ల వరకు గ్రాస్ రాబట్టిన ఈ సినిమా.. 32 కోట్ల షేర్ కలక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా సినిమాల్లో ఇది సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ కావడం మరో విశేషం. 

ఇక రెండో రోజు కూడా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో రెండో రోజుకు గాను ఈ సినిమా దాదాపుగా 15 కోట్ల షేర్, 25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా రెండో రోజు నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసినట్టు ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. ఇక మొత్తంగా చూస్కుంటే.. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 200 కోట్ల క్లబ్ లో చేరిపోయిందని టాక్. 

ఓ పక్క సినిమాపై విమర్శలు, నెగిటీవ్ రివ్యూస్, బైకాట్ కామెంట్స్.. వీటన్నిటినీ తట్టుకొని కూడా ఆదిపురుష్ ఈ రేంజ్లో కలెక్షన్స్ సాధిస్తుంది అంటే నిజంగా గ్రేట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మూడవ రోజు ఆదివారం కావడంతో ఈ వసూళ్లు మరింతగా పెరిగే  అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.