మేఘాంశ్ శ్రీహరి హీరోగా ‘ఆస్మాన్’ మూవీ ఫస్ట్ లుక్,

మేఘాంశ్ శ్రీహరి హీరోగా ‘ఆస్మాన్’ మూవీ ఫస్ట్ లుక్,

మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ దర్శకత్వంలో వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’.  శ్రీహరి జయంతి సందర్భంగా శనివారం మూవీ ఫస్ట్ లుక్‌‌, మోషన్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో శ్రీహరి భార్య శాంతి మాట్లాడుతూ ‘మేఘాంశ్‌‌పై నమ్మకంతో ఈ సినిమా తీస్తున్న మేకర్స్‌‌కు థ్యాంక్స్‌‌. పగలు,  రాత్రి అనే తేడా లేకుండా తనతో వర్క్ చేయిస్తున్నారు. శ్రీహరి గారు కూడా అలాగే నటించేవారు.

ఆర్టిస్టులు ఎప్పుడూ అలానే కష్టపడాలి. ఓ తల్లిగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు.  దర్శకుడు రామ్ చాలా అద్భుతంగా ఈ సినిమా తీస్తున్నాడని హీరో మేఘాంశ్‌‌ చెప్పాడు.  థియేటర్స్‌‌లో అందరినీ ఆశ్చర్యపరిచే సినిమా అవుతుందని దర్శకుడు రామ్ నందన్ చెప్పాడు. సెట్‌‌లో మేఘాంశ్‌‌ని చూసి ఆశ్చర్యపోయేవాళ్లమని, శ్రీహరి గారి కొడుకు అంటే ఇలానే ఉంటాడనిపించేలా నటించాడని నిర్మాత వెంకటేష్‌‌ అన్నారు.  హీరోయిన్ రాయంచ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.