పాటకు ప్రభాస్ వాయిస్ ఓవర్.. జై శ్రీరామ్ లిరికల్ సాంగ్ ఔట్

పాటకు ప్రభాస్ వాయిస్ ఓవర్.. జై శ్రీరామ్ లిరికల్ సాంగ్ ఔట్

ఆదిపురుష్​ నుంచి ‘జైశ్రీరామ్..’​ అంటూ ఓ లిరికల్​ మోషన్​ పోస్టర్​ను రిలీజ్​ చేసింది మూవీ టీమ్​. ‘చార్​ధామ్​ వెళ్లలేకపోతున్నారా.. ప్రభువు శ్రీరామ్​ను స్మరించుకుంటే చాలు’ అంటూ ప్రభాస్​ దీనికి క్యాప్షన్​ ఇచ్చాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్​ కొత్త పోస్టర్​కు సైతం మంచి రెస్పాన్స్​ వస్తోంది.

ఇప్పటివరకు విడుదల చేసిన లుక్స్​ కన్నా ఇది పవర్ఫుల్​ లుక్​ అంటూ ఫ్యాన్స్​ సంబరపడిపోతున్నారు. ఓం రౌత్​ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్​, కృతి సనన్​ సీతారాములుగా కనిపించనున్నారు. జూన్​ 16న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.