Adipurush Social Media Review: ఆదిపురుష్ బాగుంది కానీ.. అదొక్కటే!

Adipurush Social Media Review: ఆదిపురుష్ బాగుంది కానీ.. అదొక్కటే!

దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా. ప్రభాస్ రాముడిగా చేస్తున్న ఈ సినిమా జూన్ 16 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతగా కనిపించిన ఈ సినిమాని ఓం రౌత్ తెరకెక్కించాడు. దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు సినిమా రీచ్ అయ్యిందా? ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: తండ్రి దశరథుడికి ఇచ్చిన మాట కోసం రాఘవుడు.. జానకి, లక్ష్మణ సమేతంగా అడవులకు చేరుకుంటాడు. ఆతరువాత జానకిని రావణుడు లంకకు తీసుకెళ్లడం, హనుమాన్ సహాయంతో రాఘవుడు, వానర సైన్యంతో లంకను చేరి, రావణుణ్ణి సంహరించి సీతను తిరిగి అయోధ్యకు తీసుకువస్తాడు. ఇది క్లుప్తంగా ఆదిపురుష్ సినిమా కథ.

విశ్లేషణ: మన తాతలు, ఇప్పుడు మనం, మన తరువాత తరం వారు కూడా చెప్పుకునే గొప్ప కథల్లో రామాయణం ఒకటి. ఈ కథని ఎన్ని రకాలుగా, ఎన్ని సార్లు విన్నా ఆ ఆసక్తి మాత్రం తగ్గదు. రామాయణానికి ఉన్న గొప్పతనం అదే. అంతటి గొప్ప ఇతిహాస కథతో వస్తుంది కాబట్టే ఆదిపురుష్ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందులోనూ ప్రభాస్ రాముడిగా చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. మొత్తంగా సినిమా బాగానే ఉన్నా.. ఈ సినిమాను మోషన్ క్యాప్చర్ లో తెరకెక్కించడాన్ని మెయిన్ మైనస్ గ చెప్పుకుంటున్నారు. దీంతో ప్రేక్షకులకు ఒక కార్టూన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అంత పెద్ద స్టార్ క్యాస్ట్ ను పెట్టుకొని బొమ్మల సినిమా తీశారేంటి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మామూలు సినిమాగా తీసుంటే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండేదని కామెంట్స్ వస్తున్నాయి. అయితే రామాయణం అందరికీ తెలిసిన కథే కదా అందుకే కొత్తగా ట్రై చేద్దాం అని ఓం రౌత్ ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు కానీ.. ఇక్కడ అదే బెడిసికొట్టింది.

నటీనటులు: ఆదిపురుష్ సినిమాలో నటీనటులు పర్ఫార్మెన్స్ గురించి కంటే ముందు.. వాళ్ళు ఆ పాత్రకు సెట్ ఆయారా కాలేదా అనేది తెల్సుకోవాలి. ఎందుకుంటే.. ఇది గ్రాఫిక్స్ సినిమా కాబట్టి. అందుకే ఆర్టిస్టుల నటన పెద్దగా కనిపించదు. వీఎఫ్ఎక్స్ టీమ్ ఎలా చేస్తే.. వాళ్ళు అలా నటిస్తారు. వీఎఫ్ఎక్స్ వర్క్ గురించి ముందే చెప్పాం కాబట్టి.. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎలా ఉందొ మీరే ఊహించేయొచ్చు. రాఘవుడిగా ప్రభాస్ బానే సెట్ అయ్యాడు. సినిమాను తన భుజాలకి మోశాడు. జానికా పాత్రలో కృతి హుందాగా కనిపించింది. అయితే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ పాత్ర మాత్రం పెద్ద మైనస్ గా మారింది. అతని పాత్రను మలిచిన తీరు గానీ, ఆ గెటప్ గానీ  అస్సలు బాలేదు. మనకు తలిసిన రావణుడికి పది తలలు వరుసగా ఉంటాయి కానీ.. ఈ రావణుడికి ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఇది చూసి చాలా మంది నవ్వుకున్నారు. ఇలాంటి చాల సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయత. అబ్బా ఇక్కడ బానే ఉంది అని అనుకునే గ్యాప్ లోనే ఇదేంట్రా ఇలా చేశారు అనుకునేలా చేశాడట ఓం రౌత్. సినిమాను చీకట్లో కాకుండా కాస్త వెలుతురులో కూడా తీసుంటే బాగుండు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

సాంకేతిక నిపుణులు: వీఎఫ్ఎక్స్ గురించి నో కామెంట్స్. కెమెరా వర్క్ బాగుంది. సినిమాలో ఏదైనా పాజిటీవ్ పాయింట్ ఉంది అంటే అది అజయ్ అతుల్ అందించిన సంగీతమే. సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకుంటాయి. 

ఇక మొత్తంగా చెప్పాలంటే.. ఆదిపురుష్.. ప్రెజెంట్ జనరేషన్ రామాయణం.