
డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది మూవీ టీం. ఆగస్టు11, 2022 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ డైరెక్టర్ ఓం రౌత్ తన ట్విట్టర్లో తెలిపారు. పాన్ ఇండియాగా వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో 3డీలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా..బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. భూషన్ కుమార్, రాజేష్ నాయర్, రాజేష్ నాయర్, క్రిషన్ కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతారా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
#Adipurush in theatres 11.08.2022#Prabhas #SaifAliKhan #BhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/EL4WZUkyni
— Om Raut (@omraut) November 19, 2020