భారీగా పడిపోయిన ఆదిపురుష్ వసూళ్లు..

భారీగా పడిపోయిన ఆదిపురుష్ వసూళ్లు..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరపైకెక్కిన ఈ మూవీ తరుచు వివాదాలతో నిలుస్తుంది.వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్ల సునామీ  క్రీయేట్ చేసినప్పటికీ వీకెండ్స్ తర్వాత మాత్రం ఒక్కసారిగా కలెక్షన్స్ భారీగా పడిపోయాయి.సోమవారం ప్రపంచంగా ఈ సినిమా వసూళ్లు కేవలం రూ 24.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.ఈ సినిమా రీలిజ్ అయినా మొదట రోజు రూ.137 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డులు కొల్లగొట్టింది.నాలుగోవ రోజు మాత్రం వసూళ్ల విషయంలో అంచనాలు మారిపోయాయి.   

ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.240 కోట్లు. దీంతో రూ.242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయినా ప్రాఫిట్ లోకి రావాలి అంటే మాత్రం రూ. 78.85 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే రావాలి.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి నాలుగు రోజుల కలెక్షన్స్ రూ. 340 కోట్లు వచ్చాయని అధికార ట్రేడ్ వర్గాలు తెలిపాయి.భారీ బడ్జెట్ తో రీలిజ్ అయినా మూవీ టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే మాత్రం ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఆదిపురుష్ మూవీ కి వసూళ్ల విషయంలో ముందు ముందు ఎటువంటి ఫలితం వస్తుందో చూడాలి.

ఆదిపురుష్ చిత్రం భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది.సినిమా విడుదల అయ్యాక ప్రేక్షకులు,విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలని ఎదుర్కోంటోంది. డైలాగ్స్ విషయంలో ఎన్నో వివాదాలు తలెత్తిన ఈ మూవీ రామాయణం యొక్క 'ఆత్మ లేని' అనుకరణను పాటించింది అంటూ విమర్శలు వస్తున్నాయి.