_C3WFtNkvYG.jpg)
న్యూఢిల్లీ: క్లాత్స్, యాక్సెసరీల బ్రాండ్ బేవకూఫ్‌లోని మెజార్టీ వాటాను కొనుగోలు చేయాలని ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్) చూస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన చర్చలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయని, డీల్ వాల్యూ రూ.100 కోట్లు ఉండొచ్చని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు. డైరెక్ట్ టూ కన్జూమర్ (డీ2సీ) బిజినెస్‌లో ఉన్న బేవకూఫ్, గత కొన్ని నెలల నుంచి ఫండ్స్‌ను సేకరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఏబీఎఫ్‌ఆర్‌ఎల్, బేవకూఫ్‌లు అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయని సంబంధిత వ్యక్తులు అన్నారు. బేవకూఫ్‌కు తాజా ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల రెవెన్యూ వచ్చింది. కంపెనీ ఇప్పటి వరకు ఇన్వెస్ట్‌కార్ప్, ఐవీక్యాప్ వెంచర్స్, స్ప్రింగ్ మార్కెటింగ్ క్యాపిటల్‌ల నుంచి రూ.187 కోట్లను సేకరించింది. కంపెనీ వాల్యుయేషన్ రూ.482 కోట్లుగా ఉంది.