
న్యూఢిల్లీ : ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బ్రాండెడ్ రిటెయిల్ జ్యుయెలరీ బిజినెస్‌లోకి అడుగుపెడుతోంది. నోవెల్ జ్యుయెల్స్ పేరుతో ఈ కొత్త బిజిఎస్లోకి ఎంటరవుతున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రకటించింది. కొత్త గ్రోత్ ఇంజిన్స్ కోసం గ్రూప్ చూస్తోందని, అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈ కన్జూమర్ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. లైఫ్ స్టయిల్రిటెయిలింగ్లో గ్రూప్‌కు ఉన్న అనుభవం ఈ కొత్త బిజినెస్‌కు సాయపడుతుందని చెప్పారు.
దేశంలోని ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయని, దీంతో వారి కొనుగోళ్ల అభిరుచులు–అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మంచి డిజైన్స్, హై క్వాలిటీ జ్యుయెలరీని ఇష్టపడటం ఎక్కువవుతోందని బిర్లా వివరించారు. దేశంలోని పెద్ద గ్రూపులు టాటా, రిలయన్స్ఇప్పటికే రిటెయిల్ జ్యుయెలరీ బిజినెస్‌లో ఉన్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ ఇటీవలే పెయింట్స్, బిల్డింగ్ మెటీరియల్స్బీ2బీ ఈ–కామర్స్ రంగాలలోనూ ప్రవేశించింది. దేశపు జీడీపీలో జెమ్స్ అండ్ జ్యుయెలరీ మార్కెట్7 శాతాన్ని సమకూరుస్తోంది. అంతేకాకుండా, 2025 నాటికి ఈ మార్కెట్ సైజు 90 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలున్నాయి.