- ప్రశంసించిన ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : నవంబర్ 30న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)ప్రపంచ సాహిత్య వేదిక ఆన్లైన్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలసాహిత్యభేరీ అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనంలో భద్రాచలంలోని ఓ స్కూల్ విద్యార్థిని మడవి గురుత్వ సమందా సింగ్ కథా విభాగంలో పాల్గొన్నారు. 13 గంటల పాటు జరిగిన ఈ సమ్మేళనంలో పేన్పండూం అడవి రహస్యం కథ ద్వారా ఆకట్టుకున్నారు.
అంతర్జాతీయ వేదికలో ఆదివాసీ ప్రతినిధిగా ఆదివాసీ వేషధారణలో పాల్గొని ఆదివాసీ చారిత్రక సంప్రదాయ పేన్ పండగ ఔన్నత్యాన్ని అద్భుతంగా కథారూపంలో ప్రదర్శించినందుకు ఐటీడీఏ పీవో రాహుల్ చిన్నారిని గురువారం ప్రశంసించారు. తానా ఇచ్చిన ప్రశంసాపత్రాన్ని చిన్నారికి అందజేశారు. తర్వాత స్వయంగా పీవో చిన్నారితో కథ చెప్పించి విన్నారు.
