యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో అడ్మిషన్లు షురూ

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో అడ్మిషన్లు షురూ

50 శాతం పోలీస్ పిల్లలకు మిగతా సీట్లు సాధారణ ప్రజల పిల్లలకు హైదరాబాద్, వెలుగు: యంగ్  ఇండియా పోలీస్  స్కూల్‌‌లో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. 1 నుంచి 6వ తరగతుల్లో అడ్మిషన్ల కోసం ఆసక్తిగల తల్లిదండ్రులు yipschool.in వెబ్‌‌సైట్‌‌  లేదా 90591 96161 నంబర్‌‌ను సంప్రదించవచ్చు. ఈ స్కూల్ లో 50 శాతం సీట్లు పోలీస్  సిబ్బందికి కేటాయించగా.. మిగతా 50 శాతం సీట్లను సాధారణ ప్రజల పిల్లలతో భర్తీ చేయనున్నామని డీజీపీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

విద్యార్థుల భవిష్యత్తును సమగ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చదువుతో పాటు క్రీడలు, ఉన్నత విలువలతో పాటు నైపుణ్యత, వ్యక్తిత్వ వికాసంతో పాటు అత్యుత్తమ బోధన అందించే విధంగా యంగ్ ఇండియా పోలీస్  స్కూల్ లో గ్రేడ్ 1 నుండి 6 వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని తెలిపింది. ఈ స్కూల్‌‌లో విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా అకడమిక్, స్పోర్ట్స్, కో-కరిక్యులర్ కార్యక్రమాలు సమన్వయంతో కొనసాగుతున్నాయని వెల్లడించింది.

క్రమశిక్షణ, విలువలపై దృష్టి పెట్టడంతో పాటు, పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలుపెంపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ  తీసుకుంటున్నారు. yipschool.in వెబ్ సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని ఆయా నిబంధనలకు అనుగుణంగా అడ్మిషన్లు పొందవచ్చని డీజీపీ కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.