నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్స్

నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్స్

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో 2020-21 సంవత్సరానికిగాను జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ ఫరీ (జీఎన్ఎం) కోర్సులో ప్రవేశాలకు రాష్ట్ర వై ద్య విద్య డైరెక్టరేట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కోర్సు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ ఫ రీ(జీఎన్ఎం)
కోర్సు వ్యవధి: మూడేళ్లు
సీట్లు: రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రభుత్వ నర్సింగ్​ స్కూళ్లలో దాదాపు 287 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు నర్సింగ్​ స్కూల్స్ , కాలేజీలు 141 ఉన్నాయి. వీటిలో కాలేజీ స్థాయిని బట్టి కనీసం 30 సీట్లకు తగ్గకుండా కోర్సులు రన్ చేస్తున్నారు. కన్వీనర్ కోటా, మేనేజ్ మెంట్ కోటాలో అడ్మిషన్లు తీసుకోవచ్చు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్ ఉత్తీర్ణత, ఏఎన్ ఎం కోర్స్ పూర్తి చేసినవారూ అర్హులే.
వయసు: 2020 జులై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. 35 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200
దరఖాస్తులు: ఆన్ లైన్/ ఆఫ్ లైన్‌‌లో
దరఖాస్తుకు చివరి తేది: 24 సెప్టెం బర్ 2020 హార్డు కాపీలు పంపడానికి చివరి తేది: ప్రభుత్వ కళాశాలల దరఖాస్తుకు 2020 సెప్టెంబరు 19, ప్రైవేటు కళాశాలలకు అక్టోబరు 09
క్లాసెస్ : 26 అక్టోబర్ 2020
అడ్రస్ : దరఖాస్తులను ఆయా జిల్లా ల అభ్యర్థులు సంబంధిత సూపరింటెండెంట్ ఆఫీస్ లకు పంపాలి.