హోమియోపతిలో జాబ్స్.. 8వ తరగతి పూర్తి చేసి ఉంటే మంచి అవకాశం.. ఇప్పుడే అప్లై చేయండి!

హోమియోపతిలో జాబ్స్.. 8వ తరగతి పూర్తి చేసి ఉంటే మంచి అవకాశం.. ఇప్పుడే అప్లై చేయండి!

సీసీఆర్​హెచ్​లో గ్రూప్-ఏ, బీ, సీ పోస్టులుసెంట్రల్ కౌన్సిల్ ఆఫ్​ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్​హెచ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–ఏ, బీ & సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 29. 

పోస్టుల సంఖ్య: 90. 

 గ్రూప్–ఏ:  రీసెర్చ్ ఆఫీసర్ (హోమియోపతి) 12, రీసెర్చ్ ఆఫీసర్ (ఎండోక్రినాలజీ) 01,  రీసెర్చ్ ఆఫీసర్ (పాథాలజీ) 01  

గ్రూప్– బీ: జూనియర్ లైబ్రేరియన్ 01, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మాకాగ్రోసి) 01, స్టాఫ్ నర్స్ 09, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ (ఎంఎల్​టీ) 28.

గ్రూప్–సీ: ఫార్మాసిస్ట్ 03, లోయర్ డివిజన్ క్లర్క్ 27, డ్రైవర్ 02, జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ 01, జూనియర్ స్టెనోగ్రాఫర్ 03. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్/ ఎండీ, ఎంఎస్సీ, ఎంఫార్మా, లైబ్రరీ సైన్సులో డిగ్రీ, డిప్లొమా, డీఎంఎల్​టీ, 12వ తరగతి, 10వ తరగతి, జీఎన్ఎం, ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 
అప్లికేషన్లు ప్రారంభం: నవంబర్ 05.  
లాస్ట్ డేట్: నవంబర్ 26. 

అప్లికేషన్ ఫీజు
గ్రూప్–ఏ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. అన్ రిజర్వుడ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. 
గ్రూప్–బీ, సీ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. అన్ రిజర్వుడ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. 

సెలెక్షన్ ప్రాసెస్: గ్రూప్ –బీ, సీ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ I, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II పోస్టులకు సీబీటీతోపాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. 
పూర్తి వివరాలకు ccrhindia.ayush.gov.in 
వెబ్​సైట్​లో సంప్రదించగలరు.