కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 12.
పోస్టులు: 100.
పోస్టుల సంఖ్య: జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్/ ప్రొడక్షన్/ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (ఆర్001) 45, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఆర్002) 35, జూనియర్ ఎగ్జిక్యూట్ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఆర్003) 20.
ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ), ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ లో కనీసం 60 శాతం మార్కులతో బి.టెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల్లో 5 శాతం మినహాయింపు ఉంటుంది. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 29 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 05.
లాస్ట్ డేట్: నవంబర్ 12.
సెలెక్షన్ ప్రాసెస్: మొదటి ఫేజ్లో గంట వ్యవధి గల రాత పరీక్ష ఉంటుంది. సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి మల్టిపుల్ చాయిస్ రూపంలో 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 60 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది. ఉద్యోగ ఖాళీల సంఖ్య ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
శాలరీ: తొలి ఏడాది ప్రతి నెలా రూ.35,000, రెండో ఏడాది ప్రతి నెలా రూ.37,500, మూడో ఏడాది ప్రతి నెలా రూ.40,000, నాలుగో ఏడాది ప్రతి నెలా రూ.43,000 చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు bemlindia.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.
