ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. సంవత్సరం పాటు ఫ్రీగా..

ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. సంవత్సరం పాటు ఫ్రీగా..

 హైదరాబాద్​, వెలుగు: తమ వినియోగదారులందరికీ అడోబ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ ప్రీమియం సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా ఇస్తామని ఎయిర్​టెల్​ ప్రకటించింది. దీని విలువ సుమారు రూ. నాలుగు వేలు. ప్రీపెయిడ్, పోస్ట్‌‌‌‌‌‌‌‌పెయిడ్, ఎక్స్‌‌‌‌‌‌‌‌స్ట్రీమ్, డీటీహెచ్ వినియోగదారులు ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

అడోబ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్ ఏఐ ఆధారిత కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్. ఫొటోలు, వీడియోలు రూపొందించడానికి అనేక ఫీచర్లు ఉన్నాయి. సుమారు 36 కోట్ల మంది భారతీయులకు ఈ ఒప్పందం వల్ల ప్రయోజనం చేకూరనుందని ఎయిర్​టెల్​ తెలిపింది.