- సీఎం రేవంత్‌తో భేటీలో సీఈవో శంతను నారాయణ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్‌తో రేవంత్ భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలపై శంతను నారాయణ్ఆసక్తి కనబరిచారు.
రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు. టెక్ విజనరీ శంతను నారాయణ్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
