
వాషింగ్టన్: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు చెందిన వాచ్ ఒకటి వేలంలో రూ.కోట్లు పలికింది. హ్యూబర్ కంపెనీ తయారు చేసిన ఈ గోల్డ్ రివర్సిబుల్ వాచ్‌ను అమెరికాకు చెందిన అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ కంపెనీ వేలం వేయగా.. ఓ వ్యక్తి ఏకంగా రూ.8.7 కోట్లు చెల్లించి దక్కించుకున్నాడు. ఈ గడియారంపై స్వస్తిక్ గుర్తు, ఏహెచ్ అనే అక్షరాలతో పాటు మూడు తేదీలు ఉన్నాయి.
హిట్లర్ పుట్టిన తేదీ, నాజీ పార్టీ ఎన్నికల్లో గెలిచిన, హిట్లర్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన తేదీలు ఉన్నాయి. హిట్లర్ తన 44వ బర్త్ డేకు దీనిని గిఫ్టుగా అందుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1945లో ఫ్రెంచ్ సైనికులు హిట్లర్ ఇంటిపై దాడి చేసినప్పుడు వాళ్లకు ఈ వాచీ దొరికింది. ఆ తర్వాత చాలా మంది చేతులు మారింది. కాగా, ఈ వాచ్‌ను వేలం వేయడాన్ని యూదులు తీవ్రంగా వ్యతిరేకించారు.