- రాజకీయ పార్టీల విరాళాలపై నివేదిక విడుదల చేసిన ఏడీఆర్
న్యూఢిల్లీ: విరాళాల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఈసారి భారీ షాక్ తగిలింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆప్‌కు దాదాపు రూ. 38 కోట్ల విరాళాలు రాగా..2025-26 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఆ మొత్తం రూ. 12 కోట్లకు పడిపోయింది. అంటే గతేడాదితో పోలిస్తే విరాళాలు 68 శాతం తగ్గిపోయాయి. తాజాగా దేశంలోని కొన్ని పొలిటికల్ పార్టీలు తమకు వచ్చిన విరాళాల లిస్ట్‌ను ఈసీకి సమర్పించాయి.
ఆ లెక్కలన్నింటినీ విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)అనే స్వచ్ఛంద మంగళవారం తన నివేదికను రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం..ఆప్ విరాళాలు గతంలో ఎన్నడూ లేనంతగా దారుణంగా పడిపోయాయి. ఆప్ కి వచ్చిన విరాళాల్లో దాదాపు 83 శాతం మొత్తం కేవలం ఇద్దరు పెద్ద దాతల నుంచే వచ్చాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్, ట్రైడెంట్ లిమిటెడ్ సంస్థలు చెరో రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చాయి.
