మాతా శిశు మరణాలను తగ్గించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మాతా శిశు మరణాలను తగ్గించాలి :  కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించాలని మహబూబాబాద్​ కలెక్టర్​ అద్వైత్​ కుమార్ సింగ్ కోరారు. గురువారం కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మాతా శిశు మరణాలు, బ్రూణ హత్యలను నివారించాలని కోరారు. లింగ నిర్ధారణ  పరీక్షలు చేస్తే కఠిన చర్యలను చేపట్టాలన్నారు. ఆడపిల్లలను సంరక్షించాలని, క్షేత్రస్థాయిలో అంగన్ వాడీ, ఆశ కార్యకర్తలు, సీడీపీవోలు, మెడికల్ ఆఫీసర్లు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.

అంగన్ వాడీల్లో పౌష్టికాహారంతో పాటు చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా విద్యా బోధనలు చేయాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎంహెచ్​వో రవిరాథోడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సబిత, సీడబ్ల్యూసీ చైర్​పర్సన్ నాగవాణి తదితరులు పాల్గొన్నారు.